Polycet Exam : యాదగిరిగుట్ట, మే 13 : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష( పాలీసెట్-2025) మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు జిల్లాలోని 6 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. మొత్తం 1,754 మంది విద్యార్థులకు గానూ 1,664 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. ఇందులో బాలురు 910 మందికి గాను 870 మంది, బాలికలు 844 మందికి గాను 994 మంది హాజరైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా బాలురు 95.6 శాతం, బాలికలు 94.1 శాతం పరీక్షకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.