యాదాద్రి భువనగిరి : ప్రజా పాలన పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరా గద్దెనెక్కాక అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నది. చివరికి ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా కూడా ప్రభుత్వం అడ్డుకుంటున్నది. తాజాగా భువనగిరి కలెక్టరేట్ ప్రజావాణిలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా గేట్లు వేసి ఆపారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు గేట్లు తీసుకుని చొచ్చుకొని లొపలికి వెళ్లారు. చల్లురు గ్రామంలోని సర్వే నెంబర్ 322 అక్రమ మైనింగ్, ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణ జరిపించాలని కలెక్టర్ఖు వినతిపత్రం అందజేశారు.