భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 19 : బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ ముంబై వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సమ్మేళనంలో (2024 -25) ఆర్థిక సంవత్సరానికి గాను పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రెండు జాతీయ అవార్డులు సాధించింది. బెస్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇన్ ఇండియా, బెస్ట్ కంప్లైంన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ రెండు జాతీయ అవార్డులను బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ ముంబై వారు గోవాలో నిర్వహించిన జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సమ్మేళనంలో గోవా సహకార శాఖ మంత్రి సుభాష్ శిరోడ్కర్, నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జ్యోతింద్ర భాయ్ మెహతా చేతుల మీదుగా పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, సీఈఓ సీత శ్రీనివాస్, బ్యాంక్ పాలకవర్గ సభ్యులు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్, సీఈఓ మాట్లాడుతూ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతూ 15 శాఖలకు విస్తరించిందని, అతి త్వరలోనే మరో ఏడు బ్రాంచ్ లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2025 ఆగస్టు 31 నాటికి బ్యాంక్ డిపాజిట్లు రూ.257.07 కోట్లు, మంజూరు చేసిన రుణాలు రూ.202.62 కోట్లు కలవని, జాతీయ బ్యాంకులకు ధీటుగా అధునాతన సేవలను ఖాతాదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఖాతాదారులందరూ సైబర్ నేరల మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, ఏలే హరి శంకర్, సురపల్లి రమేశ్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, బిట్టు భాస్కర్, మక్తాల నరసింహ పాల్గొన్నారు. పోచంపల్లి బ్యాంక్ రెండు జాతీయ అవార్డులు గెలుపొందడం పట్ల ఖాతాదారులు, వాటాదారులు, వ్యవస్థాపకులు, వ్యాపారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.