చౌటుప్పల్, సెప్టెంబర్ 18 : పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం మరింత తలపించేలా మొక్కలను విరివిగా నాటాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని హైలాండ్ పార్కును ఆయన సందర్శించారు. పార్కులో ఉన్న ఓపెన్ జిమ్ పరికరాలను పరిశీలించారు. పిచ్చి మొక్కలను తొలగించి పార్కును పరిశుభ్రంగా ఉంచాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఊర చెరువును సందర్శించి అక్కడ పూల మొక్కలను నాటించారు.
అంతేకాకుండా వెంకటరమణ కాలనీలో డ్రైనేజీ, రోడ్డు పనులను చేపట్టేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. తద్వారా అంటు వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, ఈఈ రేణుకుమార్, వార్డ్ ఆఫీసర్లు కుమార్, రాఘవ, కాలనీవాసులు నందగిరి పరమేష్, స్వామి, మహేష్, జానీమియా పాల్గొన్నారు.