రామన్నపేట, అక్టోబర్ 15 : బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్న బీజేపీ గ్రామీణ స్థాయిలో ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం రామన్నపేట మండల కార్యాలయంలో బుధవారం జరిగిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్, రాష్ట్రపతికి పంపి నెలలు గడుస్తున్నా ఆమోదించకుండా ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తూ ఎన్నికలను గందరగోళ పరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపినా, గవర్నర్ ఎందుకు సంతకం పెట్టలేదో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. గవర్నర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు.
వెంటనే 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరిపి గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని, లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకుడు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి, జిల్లా కమిటీ సభ్యుడు బలుగూరి అంజయ్య, మండల కార్యదర్శి వరద, సభ్యులు కూరెళ్ల నరసింహచారి, బోయిని ఆనంద్, మండల కమిటీ సభ్యులు గన్నేబోయిన విజయభాస్కర్, భావనలపల్లి బాలరాజు, నాగటి ఉపేందర్, గొరిగె సోములు, గాదె నరేందర్, తొలుపునూరి శ్రీనివాస్, వేముల సైదులు, ఎండీ రషీద్, మేడి గణేశ్, డీవైఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు శానకొండ రాము, మెట్టు శ్రవణ్ కుమార్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివకుమార్, శాఖ కార్యదర్శులు మునికుంట్ల లెనిన్, శానగొండ వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి జితేందర్, కునూరు మల్లేశం, గుండాల ప్రసాద్, బొడిగె వెంకటేశ్ పాల్గొన్నారు.