భువనగిరి అర్బన్: పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఈవో చైతన్యజైనీ అన్నారు. మండల విద్యాధి కారులకు, ఆదర్శ పాఠశా లల ప్రిన్సిపాల్స్, కస్తురిబా బాలికల విద్యాలయాల, అర్భన్ రెసిడెన్షియల్ ప్రత్యేక అధికారులకు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ గూగుల్ మీట్ ద్వారా నిర్వహణపై తీసుకోవాల్సిన నియమాలు, జాగ్రత్తలపై దిశానిర్థేశం చేశారు.
జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో వసతి గృహాలు, ఉంటున్న అందరూ విద్యార్థులకు ఒక హెల్త్ ప్రొఫైల్ రికార్డును నిర్వహించా లని, ప్రతి విద్యార్థి చదువుకు సిద్ధమయ్యేలా వారికి మానసిక, నైతిక సలహాలు ఇవ్వాలన్నారు. మధ్యాహ్నాం భోజనానికి అన్ని వసతులు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు.
మిషన్ భగీరథ నీటి వసతి, తరగతి గదులు, ఆయా పాఠశాలల నిర్వహించే వసతి గృహాల్లో శానిటైజేషన్, పరిశుభ్రత ప్రతి రోజు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో వైద్య అధికారులు, సిబ్బంది పేరు, ఫోన్ నంబర్, వివరాలను ప్రదర్శించా లని తెలిపారు. కార్యాక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏడీ. ప్రశాంత్‌రెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణారెడ్డి, ప్రభుత్వ పాఠశాలల సహా య కమిషనర్ రంగరాజన్, సెక్టోరియల్ అధికారులు అండాలు, శ్రీనివాస్, జోసెఫ్, నిర్మల, జ్యోతి తదితరులు, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.