ఆత్మకూరు (ఎం), అక్టోబర్ 09 : స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం సందర్శించి నామినేషన్ల స్వీకరణ, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ, తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి రాజారాం, ఎంపీడీఓ రాములు నాయక్, ఎస్ఎచ్ఓ హనుమంత్, ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులు మోహర్ సాయి, పవన్, అభిరాం రెడ్డి, ఎంపీఓ పద్మావతి, సూపరిoటెండెంట్ లోకేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.