రామన్నపేట, అక్టోబర్ 22 : మూలాలు మరవకుండా ఎన్ఆర్ఐలు వీరేందర్రెడ్డి, పద్మ దంపతులు తమ గ్రామ ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి రామిరెడ్డి స్మారకార్థం ఆయన సతీమణి, మాజీ సర్పంచ్ దేవిరెడ్డి సావిత్రమ్మ, ఎన్ఆర్ఐలు దేవిరెడ్డి పద్మ- వీరేందర్రెడ్డి దంపతులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంను కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి కోసం వారు చేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. పోషకహార లోపం, ఎక్కువగా మొబైల్ వాడటం వల్ల చిన్న, పెద్ద తేడా లేకుండా కంటి సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పారు. 87 ఏండ్ల వయస్సులో సైతం మాజీ సర్పంచ్ దేవిరెడ్డి సావిత్రమ్మ తమ గ్రామ ప్రజల కోసం, అభివృద్ధి కోసం తపన పడడం ఆదర్శనీయమన్నారు. తొల్పునూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం భద్రతా విభాగం అధికారి గుమ్మి చక్రవర్తిరెడ్డి. ఆర్క్ చైర్మన్ గుమ్మ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ మనోహర్, శంకర్ నేత్రాలయం ప్రతినిధి భాను, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మాజీ సర్పంచులు కట్ట యాదయ్య. ఉయ్యాల లక్ష్మీనర్సు, జానకిరాములు, బొడ్డుపల్లి వెంకటేశం, గాదే శోభారాణి పాల్గొన్నారు.