– పీఐసీ కమిటీ చైర్మన్‌గా పొటోళ్ల శ్యాంకుమార్ గౌడ్ నియామకం
బీబీనగర్, జూలై 07 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్సన్-ఇన్-చార్జ్ (పీఐసీ) కమిటీని నియమించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ జీఓ ఆర్టీ నెం.382ను గడిచిన సోమవారం జారీ చేసింది. కొత్త కమిటీ ఆరు నెలల పాటు లేదా పీఏసీఎస్ ఎన్నికలు నిర్వహించే వరకు, ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. సహకార సంఘం నిర్వహణలో గుర్తించిన పరిపాలనా లోపాలు, ఆడిట్ అభ్యంతరాల పరిష్కారంలో జాప్యం, రుణాల వసూళ్లలో నిర్లక్ష్యం, బకాయిల పెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేక కమిషనర్ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పీఏసీఎస్ పునర్వ్యవస్థీకరణ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సంఘం వ్యవహారాలను కొత్త కమిటీ నిర్వహించనుంది. కొత్త కమిటీ ఛైర్మన్‌గా పొట్టోళ్ల శ్యామ్‌కుమార్ నియమించగా, సభ్యులుగా వాకిటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉప్పలంచి శ్రీకాంత్, కట్ట పెంటమ్మ, రంగొళ్ల శ్రీనివాస్, వంగూరి శివకుమార్, మైలారం నర్సింహ, గండు బస్వయ్య యాదవ్, శెట్టి బాలమణి, అంబెపు బాల్ రాజ్, సురకంటి దన్‌పాల్‌రెడ్డి, బానోతు వినోద్ నాయక్, వనం శ్రీశైలం గౌడ్ నియమితులయ్యారు.