Bhuvanagiri : భువనగిరిలో నవజాత శిశువును విక్రయించడం కలకలం రేపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించిన శిశువుకు సంబంధించిన పూర్తి రిజిస్టర్లు, కేస్ షీట్లు, ఇతర రికార్డులను ట్యాంపరింగ్ చేసిన నిందితులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పుడే పుట్టిన బిడ్డను రూ.10 లక్షల రూపాయలకు అమ్మినట్టుగాగా పూర్తి ఆధారాలు లభించాయి.
షెడ్యూల్ కులానికి చెందిన వితంతువు ఆర్థిక పరిస్థితిను ఆసరాగా చేసుకొని నిందితులు శిశువు విక్రయానికి పథకం వేశారు. నవజాత శిశువు అసలు గుర్తింపును మార్చి కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలను ఆస్పత్రి, ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.