నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా గుట్టురట్టు
ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ నూనావత్ సాగర్ వెల్లడించారు.
– ఇద్దరు నిందితులు అరెస్ట్, పరారీలో మరొకరు
కారేపల్లి, జూలై 31 : ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ నూనావత్ సాగర్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు రాగితో ఆభరణాలను తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారంలా కనిపించేలా తయారు చేసేవారన్నారు. అనంతరం నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడంతో పాటు, ప్రైవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలిందన్నారు.
ఈ క్రమంలో ఇల్లెందు ముత్తుట్ ఫైనాన్స్ లో 52 గ్రాముల బంగారం పెట్టించి రూ.3.90 లక్షలు తీసుకున్నారు. దానిని రిలీజ్ చేయించడానికి ప్లాన్ చేసి హైదరాబాద్ లోని “మన గోల్డ్ కంపెనీ” ని సంప్రదించి వారి ప్రతినిధి ద్వారా మరో రూ.5.80 లక్షలు తీసుకుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి కారు, రూ.15 వేల నగదు, మొబైల్ పోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోత్ సునీల్ కుమార్, కారేపల్లి మండల కేంద్రానికి చెందిన ముందాడా రామ్చందర్గా గుర్తించినట్లు తెలిపారు. మరో వ్యక్తి సూర్యతండాకు చెందిన దారవత్ రాకేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కారేపల్లి, కామేపల్లి ఎస్ఐలు భైరు గోపి, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

