భువనగిరి అర్బన్: నాటిన ప్రతి మొక్కను బతికించాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు రహదారి మధ్య డివైడర్‌పై మట్టి ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా డివైడర్ల మధ్యలో, ఖాళీ ప్రాంతాల్లో, పార్కుల వద్ద, ఇతర ప్రాంతాల్లో నాటిన ప్రతి మొక్కను బతికించాలన్నారు. మొక్కలకు ప్రతిరోజు నిరందించాలని, నీటి సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు చనిపోతే వాటి స్థలంలో కొత్త మొక్కలు నాటించాలని అధికారులకు సూచించారు.