రాజాపేట, మే 15 : నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సేవలు వినియోగించుకోవాలని మహమ్మద్ ఆలీ షరీఫ్ కోరారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఎల్ఎఫ్సీ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ అందిస్తున్న సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంట్, సేవింగ్ అకౌంట్ అందజేస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై తులానికి రూ.63,000 తక్షణమే రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్‌తో లాకర్ సదుపాయం ఉందన్నారు. బ్యాంక్ అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని బ్యాంక్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. అంతకుముందు బ్యాంక్ అందిస్తున్న సేవల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.