యాదగిరిగుట్ట, ఏప్రిల్ 15 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి కోటేశ్వర్ రావు (కోటి) దర్శించుకున్నారు. మంగళవారం స్వామి వారి కొండపైకి చేరుకున్న ఆయన స్వయంభూ లక్ష్మి నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వాహణాధికారి భాస్కరరావు స్వామి వారి ప్రసాదం అందజేశారు. స్వామివారి చరిత్ర, క్షేత్రానికి సంబందించి ఆల్బమ్ చేసేందుకు సంకల్పించినట్లుగా కోటి తెలిపారు.