దామరచర్ల, సెప్టెంబర్ 10 : మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంటుకు డిప్యూటి సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం రానున్నారు. పవర్‌ప్లాంటులో నిర్మాణం పూర్తయిన రెండో యూనిట్‌ను వారు ఆయిల్‌తో ట్రయల్న్ చేయనున్నారు. దీని ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. దీనితో పాటు మిగతా యూనిట్ల పనుల ప్రగతిపై టీజీ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పవర్ ప్లాంటు త్వరితగతిన పూర్తయ్యేలా చేపట్టాల్సిన పనుల గురించి చర్చించనున్నారు. మంత్రుల రాకకోసం ఏ ర్పాట్లు చేస్తున్నట్లు ప్లాంటు అధికారులు తెలిపారు.
పూర్తికాని రైల్వే లైన్లు.. అనుకూలంగా లేని రహదారులు
మూడు నెలల్లో రెండోసారి మంత్రుల బృందం యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పరిశీలన చేయనున్నది. పవర్ ప్లాంటు అనుసంధానం అయిన రైల్వే లైన్లు ఇంకా పూర్తికాలేదు. పవర్ ప్లాంటు పూర్తి స్థాయిలో బొగ్గుతో రన్ కావాలంటే సింగరేణి, మణుగూరు నుంచి దిగుమతి చేసుకునేందుకు విష్ణుపురం నుంచి జాన్‌పహాడ్ రైల్వే లైన్ నుంచి బైపాస్ లైన్లు ఇంకా పూర్తికావాల్సి ఉన్నది. గత రెండు నెలల నుంచి పవర్ ప్లాంటులోని రెండో యూనిట్ మొదటి స్టేజ్‌లో ఆయిల్ రన్ నిర్వహిస్తున్నారు. నేడు మంత్రులు ఆయిల్ రన్‌తో రెండోస్టేజీని సమీకృతం చేయనున్నారు. పవర్‌ప్లాంటుకు నార్కట్‌పల్లి అద్దంకి ప్రధాన రహదారి నుంచి అనుసంధానం చేసే రహదార్లు కూడా అనుకూలంగా లేవు. వాటిని ఆరు లైన్ల రహదారులుగా మార్చేందుకు ఎలాంటి పనులు చేపట్టలేదు. దీనితో పాటుగా పవర్‌ప్లాంటు ల్యాండ్ లూజర్లకు ఇంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పించక పోవడంతో యువత కూడా నిరుత్సాహంగా ఉన్నారు. పవర్‌ప్లాంటులో నాలుగేండ్లుగా వరుస దొంగతనాలు కూడా ఇబ్బందులు కల్గిస్తున్నాయి. ఇప్పటి పవరకు కోట్ల రూపాయల్లో ఇనుము, అల్యూమినియం, విలువైన సామాగ్రి చోరీకి గురైంది. పవర్‌ప్లాంటు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నేటికీ నష్టపరిహారం అందలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.