యాదాద్రి భువనగిరి : రేపటి నుంచి యాదాద్రి ప్రధాన ఆలయాన్ని తెరవనున్నారు. ఈసందర్భంగా యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ఈనేపథ్యంలో యాదాద్రిలో ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదాద్రి దేవాలయ ప్రత్యేక అధికారి కిషన్ రావు పాల్గొన్నారు.