రామన్నపేట, అక్టోబర్ 10 : ఒకటో తేదీనే జీతాలు అందించాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బంది ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రావిటి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి నెలా సకాలంలో జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 10వ తేదీ దాటిన నేటి వరకు జీతాలు అందలేదని వాపోయారు. వెంటనే డీ ఎస్ హెచ్ ఏర్పాటు చేయాలని, ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దేవేందర్, నవీన్ సింగ్, రజిని, నర్సింగ్ సూపరింటెండెంట్ రాణి, వైద్య సిబ్బంది జే ఏ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్ శ్రీనివాస్, ఉదయ్ రాజ్, వాసంతి, నర్సింగ్ ఆఫీసర్స్ సుశీల, వసంత, మారమ్మ, సునీత, భూపాల, శ్యామల, రాధా పాల్గొన్నారు.