రాజాపేట, మార్చి 22 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాధపురంలో శనివారం హైదరాబాద్ ఉప్పల్ శ్రీ అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 344 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వల్లందాస్ మహేశ్, ప్రజ్వల, పద్మశాలి సంఘం అధ్యక్షుడు బింగి బాలరాజు, మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్, కటకం వెంకటేశం, శ్రీనివాస్, భాస్కర్, సత్యనారాయణ పాల్గొన్నారు.