రామన్నపేట, మార్చి 26 : రామన్నపేట బార్ సోసియేషన్ ఎన్నికల్లో మూడోసారి అధ్యక్షుడిగా ఎండి మజీద్ ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎండి మజీద్, కార్యదర్శిగా యాదసు యాదయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా సంగిశెట్టి బాలరాజు, సహాయ కార్యదర్శిగా దినేశ్, కోశాధికారిగా కూనూరు శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కార్యదర్శిగా శ్రవణ్ కుమార్, లేడీ రిప్రెసెంటివ్ గా రోసమ్మ థామస్, కార్యవర్గ సభ్యులుగా పాల్వంచ జగతయ్య, సోమ సతీష్ రెడ్డి, సయ్యద్ అజిజుద్దీన్ ఎన్నికైనట్టుగా ఎన్నికల అధికారి యేళ్ల శ్రీశైలం ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఐక్యమత్యంగా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని సీనియర్ న్యాయవాదులు సన్మానించి అభినందించారు.