భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 27 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారు ప్రకాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామం పరిధిలో పలువురు నాయకులు ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. కుల సంఘాల పదవుల్లో ఉన్నవారు సుమారు 50 మంది రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాజీనామా చేసిన వారిలో రెడ్డి సంఘం నాయకులు బండారు జంగారెడ్డి, బండారు బాల్రెడ్డి, రెండో వార్డ్ ప్రధాన కార్యదర్శి కొండమడుగు శ్రీకాంత్, మండల యూత్ నాయకులు బండారు వినోద్ రెడ్డి, కొండమడుగు బాలకృష్ణ, బద్దం రాజు, ఒంటెద్దు ఎల్లయ్య, రెండో వార్డ్ యూత్ అధ్యక్షుడు పోతగల తరుణ్, భానోత్ వంశి, ఇతరులు ఉన్నారు.