Husband Wanted | ‘మొగుడు కావాలి’.. ఉద్యోగ ప్రకటనలా గూగుల్ ఫామ్ పెట్టిన యువతి.. 240 దరఖాస్తులు!
Husband Wanted | అందరిలానే తాను కూడా ఎవరినో ప్రేమించి, పెండ్లి చేసుకుంటే ఏం వెరైటీగా ఉంటుంది అని భావించిన అమెరికాకు చెందిన ఒక యువతి ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.
Husband Wanted | న్యూయార్క్, అక్టోబర్ 4: అందరిలానే తాను కూడా ఎవరినో ప్రేమించి, పెండ్లి చేసుకుంటే ఏం వెరైటీగా ఉంటుంది అని భావించిన అమెరికాకు చెందిన ఒక యువతి ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఉద్యోగ ఖాళీ తరహాలో ఆమె ఆన్లైన్లో ‘మొగుడు కావాలి’ అని ఒక ప్రకటన ఇచ్చింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. అప్పటికే డేటింగ్ యాప్స్ లాంటి వాటి ద్వారా తోడు కోసం వెతికి కాలాన్ని వృథా చేసుకుని విసిగి వేసారిన ఎరిన్ పాటర్సన్ అనే యువతి వినూత్నంగా ఒక గూగుల్ ఫామ్‌ను రూపొందించింది.
దానిలో ఆమె తనకు కావాల్సిన భర్త గురించి ప్రశ్నలను ఉంచింది. ‘నేను ఒక అందమైన, తెలివైన, సహృదయం గల, కాఫీ /డిన్నర్ చేస్తూ మంచి సంభాషణలు ఆస్వాదించే వ్యక్తి కోసం చూస్తున్నా’ అని పేర్కొంది. ఆ ఫాంలోని ప్రశ్నావళిలో దరఖాస్తు చేయబోయే వ్యక్తి వృత్తిపరమైన సంబంధాలు, కెరీర్ లక్ష్యాలు, సంబంధాల పట్ల అంచనాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. అంతేకాక దరఖాస్తుదారుడి వృత్తిపరమైన లక్ష్యాలు, అతడి రోజువారీ దినచర్య, వ్యాయామ విధానాలు, పెండ్లిపై, కుటుంబంపై అతడి అభిప్రాయాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆమె ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఆమెను పెండ్లాడటానికి పలువురు క్యూ కట్టారు. ఇప్పటివరకు ఆమెకు 240 దరఖాస్తులు వచ్చాయి. ఇది వినూత్నమైన ఆలోచన అని పలువురు నెటిజన్లు ప్రశంసించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

