రాజాపేట, జనవరి 23 : రాజాపేట మండలంలోని చిన్న మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద శుక్రవారం మండె మెలిగే పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు పూజా సామగ్రి, పసుపు, కుంకుమ తీసుకుని బూరుగుపల్లి నుండి డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా తల్లుల గద్దెల వద్దకు చేరుకున్నారు. గద్దెల వద్ద పూజా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క, సారలమ్మల పూజారులు ఒకరికి ఒకరు కంకణాలు కట్టుకుని సాకను ఇచ్చిపుచ్చుకుని జాతర ముగిసేవంత వరకు రాత్రంతా గద్దెల వద్ద జాగారాలు చేయనున్నారు.