వలిగొండ, జులై 09 : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్పూర్ గ్రామంలో వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్యామల స్వామి (45) వృత్తిరీత్యా ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మానసికంగా విసిగిపోయి జీవితం మీద విరక్తితో మండలంలోని కంచనపల్లి గ్రామ పరిధిలో మంగళవారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.