సంస్థాన్ నారాయణపురం, జూలై 12 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నా పోస్టర్ను నారాయణపురం మండల కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాట తప్పి జీఓల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని చూస్తే బీసీ వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీసీ జనాభా సర్వే నిర్వహించాలని, 33 శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భిక్షం, వడ్డేపల్లి రాములు, సాగర్, ఉప్పల శీను, రసాల వెంకటేశ్, రాసాల ఆంజనేయులు, బద్దుల యాదగిరి, ఎస్కే జానీ పాల్గొన్నారు.