సంస్థాన్ నారాయణపురం, జూన్ 2 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జునైరా మహావీశ్ ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 544 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సత్కరించి అభినందనలు తెలిపి సైకిల్‌ను బహూకరించారు. మండల కేంద్రానికి చెందిన ఖాజా అమానొద్దీన్కు నలుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కూతురు జునేరా మహావీశ్. తల్లి మరణించడంతో తనకంటే చిన్నవారైన ముగ్గురు చెల్లెళ్లను చూసుకుంటూనే కష్టపడి చదువుకుని పదో తరగతిలో 600/544 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది.