రామన్నపేట, డిసెంబర్ 23 : గత రెండు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లో పాల్గొన్న రామన్నపేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో వి.శరణ్ తేజ్ జిల్లా ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు చెప్పారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ విభాగంలో బి.ప్రణీత్ రెడ్డి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి పొందగా, హెల్త్ అండ్ హిజెనూన్ సీనియర్ విభాగంలో జి.లిఖిత జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి, వేస్ట్ to వెల్త్ విభాగంలో ఏ.మాళవిక, ఎన్.అన్షు శ్రీ జిల్లా స్థాయి ద్వితీయ బహుమతులు సాధించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా స్థాయి బహుమతులు పొందిన విద్యార్థులకు జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, జిల్లా విద్యా శాఖ అధికారి సత్యనారాయణ మెమంటోలు, సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి లో ప్రతిభ కనబరిచేలా విద్యార్థులను ప్రోత్సహించిన గైడ్ టీచర్ మురళిని పాఠశాల ప్రిన్సిపాల్ బి.యాదగిరి, డైరెక్టర్ జె వి ఎన్ ఎస్ మణి, ఉపాద్యాయులు అభినందించారు.

Ramannapet : రాష్ట్రస్థాయి సైన్స్ఫేర్కు కృష్ణవేణి విద్యార్థులు ఎంపిక