– అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
– బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 04 : కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా.. ఖబర్దార్, బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు బంధారపు భిక్షపతి, మాజీ కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేశ్, నాయకులు గడ్డమీది మాధవులు, ఎరుకల హేమేందర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణ సీఐ భాస్కర్ ను గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాయీ బ్రాహ్మణుల వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదా అని వివరణ అడిగితే కర్రె వెంకటయ్యపై రెచ్చిపోయి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పని చేసే నాయకుడు, మచ్చలేని మనషి కర్రె వెంకటయ్య అన్నారు. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరారు.
మిమ్మల్ని మాట్లాడిస్తున్న మీ నాయకుడి పరిస్థితి ఒక్కప్పుడు ఎలా ఉండేదో అందరికి తెలుసునన్నారు. తెచ్చిన అప్పులు కట్టలేక, దాచుకుని తిరిగే వాడన్నారు. పాలను అమ్ముకుని సాధారణ జీవితాన్ని గడిపిన మీ నాయకుడికి కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. కొండపైన వర్తక, వ్యాపారుల వద్ద మీ నాయకుడు డబ్బులు తీసుకున్నాడో లేదో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరె శ్రీధర్, ఆవుల సాయి, సయ్యద్ బాబా, బండి వాసు, దండబోయిన వీరేష్, సూదగాని శ్రీకాంత్, గ్యాదపాక క్రాంతి, గుండ్లపల్లి వెంకటేష్, గౌడ శ్రీశైలం, ఒగ్గు మల్లేష్, ఆకుల శేఖర్, సర్ధార్ సయ్యద్ పాల్గొన్నారు.