రాజాపేట, ఆగస్టు 08 : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం రాజపేట మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలేరు నియోజకవర్గ ప్రజలకు రామన్న మరిన్ని సేవలు అందించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, పట్టణ అధ్యక్షుడు బెడిద వీరేశం, జలసాధన సమితి అధ్యక్షుడు ఎర్రగోకుల జస్వంత్, రాష్ట్ర మాజీ సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొంగోని ఉప్పలయ్య, మాజీ సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ గంధమల్ల సురేశ్, కుర్రారం గ్రామ శాఖ అధ్యక్షుడు రేకులపల్లి మల్లారెడ్డి, మండల సీనియర్ నాయకుడు గోపగాని యాదగిరి గౌడ్, జూకంటి బాలస్వామి, నందా ఐలయ్య, మండల యువ నాయకులు గజ్జల రాజు, గొడుగు రాజు, ఎర్రగుంట కిషన్ కుమార్, గజం కరుణాకర్, బొడ్డు భాస్కర్, రాగుల నవీన్, మేడి తరుణ్ పాల్గొన్నారు.