బీబీనగర్, డిసెంబర్ 27 : బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామ సర్పంచ్ నక్కిర్తి హేమలత గణేశ్ ముదిరాజ్ తన పాలకవర్గంతో కలిసి శనివారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్ రెడ్డి నూతన పాలకవర్గాన్ని సర్పంచ్ నక్కిర్తి హేమలత గణేశ్ ముదిరాజ్, ఉప సర్పంచ్ మురిగాడి చంద్రమౌళి గౌడ్, వార్డు సభ్యులు దొడ్డి రజిత రమేశ్, నక్కిర్తి రాధికా రమేశ్, మోతే కుమార్, సల్ల అనురాధను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచులు తంతరపల్లి అంజయ్య గౌడ్, మురిగాడి బాల మల్లేశ్, తమ్మిగంటి బాల పోచయ్య, కోమటిరెడ్డి మహిపాల్ రెడ్డి, సోము శ్రీనివాస్, ఎరుకల గణేశ్ పాల్గొన్నారు.

Bibinagar : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కలిసిన జైనపల్లి పాలకవర్గం