సంస్థాన్ నారాయణపురం, జూన్ 07 : మునుగోడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోని అసమర్ధ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారని, ఎన్నికలు అయిన మరుక్షణమే ఆయన ప్రజలను మర్చిపోతారన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో మధ్యం, డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేసి గెలిచిన తర్వాత బెల్ట్ షాపులను బంద్ చేయిస్తున్నానని చెప్పడం మూర్ఖత్వమన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు కేటాయించకుండా, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కేటాయించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్, నాయకులు బచ్చనబోయిన దేవేందర్, జక్కలి రాజు, భాస్కర్ నరసింహ, వంగరి రఘు, సూరపల్లి శివాజీ, జక్కర్తి భిక్షం, ఆత్కూరి రాములు, నందగిరి జగత్ కుమార్, లింగస్వామి, బండమీది కిరణ్, ఎలిజాల శీను పాల్గొన్నారు.