భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 02 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటానని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు, పెద్ద చెరువు రైతు సంఘం డైరెక్టర్ మెరుగు జెన్నయ్య యాదవ్ (65) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. జెన్నయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతదేహంపై మంగళవారం పైళ్ల శేఖర్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం వంకమామిడి గ్రామంలో మాజీ ఎంపీటీసీ సుర్వి సత్యనారాయణ తండ్రి రాములు గౌడ్ (80) మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేశ్, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డి, సామ రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, మండల, పట్టణ ప్రధాన కార్యదర్శులు చిలువేరు బాలనరసింహ, గునిగంటి మల్లేశ్ గౌడ్, సీత శ్రవణ్, నాయకులు సామల మల్లారెడ్డి, కుడికాల బలరాం, సార బాలయ్య, మునుకుంట్ల బాలచందర్, నోముల మాధవరెడ్డి, ఐతరాజు భిక్షపతి, కుంటోళ్ల మహేశ్, జాంగిర్, చేరాల చిన్న నరసింహ, చింతకింది కిరణ్, పొన్నమోని శ్రీశైలం, జింకల యాదగిరి, నోముల ఉపేందర్ రెడ్డి, తంతరపల్లి వెంకటేశ్, కొంక లక్ష్మీనారాయణ, భారత గిరి, సిద్దుల ప్రభాకర్, కర్నాటి అంజమ్మ పాల్గొన్నారు.