బీబీనగర్ పీహెచ్సీలో కిశోర బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 14 సంవత్సరాల కిశోర బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక రెడ్డి ప్రారంభించారు.
బీబీనగర్, ఏప్రిల్ 4 : బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 14 సంవత్సరాల కిశోర బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కిశోర బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. 14 సంవత్సరాల వయస్సులో ఈ టీకా వేయించుకోవడం ద్వారా భవిష్యత్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అర్హత కలిగిన ప్రతి బాలిక ఈ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను టీకా కార్యక్రమానికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పావని, సూపర్వైజర్లు శాంతాకుమారి, ప్రభాకర్, ఎంపీహెచ్ఏ వసంత, కవిత, డీఈఓ శ్రీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

