ఆలేరు టౌన్, ఆగస్టు 05 : చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు మాజీ మెంబర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి ధనుంజయ కార్మికులకు అన్నారు. మంగళవారం ఆలేరులోని సిల్క్ నగర్ కాలనీలో శివశంకర్ సిల్క్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్టలో జరిగే చేనేత సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరవుతున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి అందిస్తున్న సబ్సిడీ పథకాలపై నేత కార్మికులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకరి సుజన్ కుమార్, జిల్లా కార్యదర్శి యెన్నం శివకుమార్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కామిటికారి కృష్ణ, అధికార ప్రతినిధి తునికి దశరథ, బూత్ అధ్యక్షులు గుర్రం నరసింహులు, అమృతం నరసింహులు, ఏలూరు సత్యనారాయణ, రచ్చ హరికుమార్, బసవలింగం, ఏలూరి సత్తయ్య, ఎలా వెంకటేశ్, చేనేత కార్మికులు పాల్గొన్నారు.