రాజాపేట, నవంబర్ 07 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి క్రీడలు బాలుర విభాగంలో రెండో రోజు వివిధ పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ హోరాహోరీగా క్రీడలు కొనసాగాయి. అథ్లెటిక్స్ లో అండర్- 14 (100 మీటర్)లో పి.వెంకటస్వామి, ఘన్ పూర్ (ప్రథమ స్థానం), కె.గణేశ్, అనుముల (ద్వితీయ స్థానం), ఈ.ప్రణీత్ ఘన్పూర్ (తృతీయ స్థానం). అండర్ – 17 (100 మీటర్)లో వై.ప్రణయ్, భువనగిరి (ప్రథమ స్థానం), హర్షవర్ధన్, తిప్పర్తి (ద్వితీయ స్థానం), ఎం.మహేశ్ (తృతీయ స్థానం). అండర్- 19 (100 మీటర్) విభాగంలో ఎం.స్వామి, తిప్పర్తి (ప్రథమ స్థానం), సి.హెచ్.పవన్, ఘన్పూర్ (ద్వితీయ స్థానం), వి.రామ్ చరణ్, అనుముల (తృతీయ స్థానం).
షార్ట్ పుట్ అండర్- 19 విభాగంలో పి.అరవింద్, అనుముల (ప్రథమ స్థానం), వెంకన్న- జనగాం (ద్వితీయ స్థానం), ఎల్.చరణ్- ఘన్పూర్ (తృతీయ స్థానం). లాంగ్ జంప్ అండర్ 14 విభాగంలో ఎం.చైతన్య, చండూరు (ప్రథమ స్థానం), కె..గణేశ్, అనుముల (ద్వితీయ స్థానం), డి.చిరంజీవి- అనుముల (తృతీయ స్థానం). ఫుట్ బాల్ అండర్ 19 ఫైనల్ రాజాపేట జట్టుపై జనగామ జట్టు ఘన విజయం సాధించింది. యాదాద్రి డీసిఓ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్, క్రీడల సమన్వయకర్త జి.శ్రీనివాస్, పీడీలు వెంకటేశ్వర్లు, కిషన్, శృతి పోటీలను పర్యవేక్షించారు.

Rajapet : హోరాహోరీగా గురుకుల జోనల్ స్థాయి క్రీడా పోటీలు