Eye Tests | గుండాల: మండలంలోని గంగాపురం గ్రామంలో మాదాడి కుటుంబ సభ్యులు, శంకర నేత్రాలయం- మేసు (మొబైల్ ఐ సర్జికల్ యూనిట్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన లభిస్తుంది. గార్లపాటి సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల 16 నుంచి 26 వరకు జరిగే శిబిరంలో ఉచిత కంటి పరిక్షలు, కంటి అద్దాలు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయిస్తుండటంతో ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది.
అక్కడకు వచ్చిన ప్రజలకు అంచెలంచెలుగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇస్తూ.. భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాదాడి వంశీరెడ్డి, మాదాడి భరత్ రెడ్డి, మాదాడి అరుణ్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ దార సైదులు తదితరులు పాల్గొన్నారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు