భూధాన్ పోచంపల్లి, అక్టోబర్ 17 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలంలో పోచంపల్లి, రేవనపల్లి, గౌస్ కొండ గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అకాల వర్షాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఏడీఏ వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ మేనేజర్ హరికృష్ణ, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ రోజా రాణి, మండల వ్యవసాయ అధికారి శైలజ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీధర్, అసిస్టెంట్ రిజిస్టర్ వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ సీఈఓ బాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు తడక వెంకటేష్, మర్రి నర్సింహారెడ్డి, సామ మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, నాయకులు కొట్టం కరుణాకర్ రెడ్డి, గోరంటి శ్రీనివాస్ రెడ్డి, బండారు ప్రకాష్ రెడ్డి, సుర్వి వెంకటేష్, మద్ధి అంజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.