భూదాన్ పోచంపల్లి, మే 29 : ధాన్యo కొనుగోళ్లను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి సిబ్బందికి సూచించారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల శివరెడ్డిగూడెం గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని, రైతుల సమస్యలు ఏమైనా ఉన్నాయని ఆరా తీశారు. మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి తరలించాలని సూచించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసే ప్రమాదం ఉన్నందున అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎం.ఆర్.ఐ గుత్తా వెంకట్‌రెడ్డి ఉన్నారు.