భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్, మెహర్ నగర్, గౌస్ కొండ, రామలింగంపల్లి, భీమనపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మానం, పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వ కృషి చేస్తుందని తెలిపారు. జలాల్పూర్లో ఎన్ఎస్ఎస్ యూనిట్- 1, యూనిట్- 2 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో వన మహోత్సవంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు కళ్లెం రాఘవరెడ్డి, తడక వెంకటేష్, సామ మధుసూదన్ రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేష్, నాయకులు గోరంటి శ్రీనివాస్ రెడ్డి, మన్నె వెంకట్ రెడ్డి, అనిరెడ్డి జగన్ రెడ్డి, ఫకీరు నర్సిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు సుర్వి వెంకటేశ్, రేణిగుంట లాలయ్య, కుక్క దానయ్య, మద్ది అంజిరెడ్డి పాల్గొన్నారు.
Bhoodan Pochampally : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి