– టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంజాల సురేశ్ గౌడ్
బీబీనగర్, డిసెంబర్ 31 : బీబీనగర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంజాల సురేశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు గతంలో మాజీ సర్పంచ్, ఎంపీటీసీలను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సమిష్టి కృషితో పాలకవర్గం పని చేయాలని సూచించారు.
గ్రామ సంక్షేమానికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్, గోలి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి, నూతన సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గోలి నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు ఆకుల రాజ్యలక్ష్మి, కాసుల వరలక్ష్మి, మంగ అశోక్, పంజాల ప్రవీణ్, నెల్లుట్ల శ్రీశైలం, ఆకుల దివ్య, పిట్టల శ్యామల, రొడ్డ యమున, సోమ శివ కుమార్, బుర్రి సుదర్శన్, ట్రస్ట్ సభ్యులు పంజాల సదానంద గౌడ్, రాకేష్, మల్లారెడ్డి, ఆశోక్ శర్మ, గణేశ్ పాల్గొన్నారు.