ఆలేరు టౌన్, ఆగస్టు 14 : ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతలపాణి శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోట్ల పరమేశ్వర్, పట్టణ మాజీ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్వర్లు, పంతం కృష్ణ, కొలువుల హరినాథ్, సారాబు సంతోశ్, పాశికంటి శ్రీనివాస్, ఆడెపు బాలస్వామి, మధు, శ్రవణ్, ఎండీ.ఫయాజ్, బాలరాజు, జమాల్ పాల్గొన్నారు.