యాదగిరిగుట్ట, జూన్ 13 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడిన ఘటనలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తుంటి ఎముకకు గాయమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆమె ఆకాక్షించారు.