ఆలేరు టౌన్,జూలై 13 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో దరిపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆదేశాల మేరకు ఆలేరు మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, కో కన్వీనర్ ఓరుగంటి గోపాల్, సభ్యులు గుమ్మడి రమేష్, జివికపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన ఆలేరు కుమ్మరి సంఘం మండల కన్వీనర్ గా, బీ ఆర్ ఎస్ పార్టీ సాయి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు గంగదారి సుధీర్ కుమార్, కో-కన్వీనర్ గా కొరుటూరు ఉపేందర్ జివికపల్లి సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వీరితోపాటు ఆలేరు మండల కమిటీ సభ్యులుగా కందికొండ సాగర్, కొరుటూరు శ్రీనివాస్, విజ్జగిరి లక్ష్మీనారాయణ, శనిగారం రవీందర్, తేరాల రమేష్, గంగదారి మహేందర్, గంగదారి రాజు, గంగదారి పరమేష్, గంగదారి శ్రావణ్, గంగదారి సాగర్, గంగదారి సాయి కిరణ్ , శనిగారం సత్యనారాయణ, పారెల్లి ఆంజనేయులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ కుమ్మరి సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.