న్యూఢిల్లీ : కేరళ పేరు ‘కేరళం’గా మారిన వేళ.. మరిన్ని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలంటూ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలను సంప్రదించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ పంపారు.
‘ఇంద్రప్రస్థ అనేది నగరానికి నిజమైన పురాతన గుర్తింపు. ఇది పాండవుల రాజధానిగా మహాభారతం నాటిది’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. స్వదేశీ గుర్తింపును పునరుద్ధరిస్తూ బాంబే, కలకత్తా నగరాల పేర్లను ముంబై, కోల్కతాగా మార్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.