బీబీనగర్, ఆగస్టు 25 : జాతీయ మానవ హక్కుల కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండమడుగు గ్రామానికి చెందిన గాండ్ల రవి నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు యేల్లంల శ్రీధర్‌రెడ్డి సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు మహ్మద్ యాసీన్కి, రాష్ర్ట అధ్యక్షుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు భువనగిరి సదానందం గౌడ్, చీర అయిలయ్య, చెరుకు భాస్కర్ గౌడ్, కనకబోయిన నాగరాజ్, పెంటబోయిన వేణు, అరుముళ్ల శ్రీకాంత్, కొంగల నర్సింగ్ రావు, జల్లి మల్లికార్జున్, పద్మ వెంకటేష్, మేకల మహేశ్ గౌడ్, అజ్గర్ అలీ, జల్లి సిద్దు, కుర్మిండ్ల ప్రేమ్ చంద్ గౌడ్ పాల్గొన్నారు.