యాదగిరిగుట్ట, ఏప్రిల్ 16 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీజీ పాలిసెట్-2025 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు.
ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు కళాశాల అధ్యాపకులచే శిక్షణ కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19 ప్రవేశ పరీక్షకు చివరి గడువని, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష మే 13వ తేదీన జరుగనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ నంబర్లు 80998 99793, 90106 29270 ను సంప్రదించాలని సూచించారు.