భువనగిరి అర్బన్, జూలై 04 : భువనగిరి పట్టణంలోని హోటల్స్ పరిసరాలు, ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉన్నా, నాణ్యత లేకున్నా జరిమానాతో పాటు హోటల్స్ ను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. శనివారం భువనగిరి పట్టణంలోని వివిధ హోటల్స్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోటల్స్ లలో అపరిశుభ్రత వాతావరణం కనిపిస్తే జరిమానా తప్పదన్నారు. కిచెన్స్ లలో శుభ్రతను పాటించాలని, ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న కొన్ని టిఫిన్స్ సెంటర్లను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లను గుర్తించి ఐదు హోటళ్లకు ఒక్కొక్క హోటల్ కు రూ.6 వేల వరకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.