రాజాపేట, మే 20 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన టాగూర్ గణేశ్సింగ్ కుమార్తె సన అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న గణేశ్సింగ్తో పాటు చదువుకున్న 2000- 01 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు రూ.55 వేలు ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో సందిల భాస్కర్ గౌడ్, ఠాకూర్ మనోజ్ సింగ్, సోమసాని వెంకటేశ్, ఠాగూర్ సబితా రాణి, ప్రేమలత, నాగరాణి, భాగ్యలక్ష్మి, భానుమతి, అంకత్ శ్రీకాంత్, నంగునురి రాజేశ్వర్, నంగునూరు నరేశ్, మంచాల అనిల్ రాజా, నంగునూరు సాగర్, ప్రేమలత, వేముల బాబురావు, జన్నపల్లి బాలరాజురెడ్డి, మధు, స్వామి, అడేవు గణేశ్, ఆడెపు ఉపేందర్, గొల్లన రవి, బిర్రు శ్యామ్ పాల్గొన్నారు.