యాదగిరిగుట్ట, నవంబర్ 20 : రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మహిళా కూలీ మృతి చెందింది. మోటకొండూరు గ్రామానికి చెందిన వంగపల్లి ఉప్పలమ్మ(50), భర్త రామ్ నర్సయ్య అనే మహిళా కూలీ ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద కందుకూరు రైల్వే గేట్ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా ఆలేరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న బ్రెజా కారు (TS -08-FV-6624) ఢీకొట్టడంతో మహిళ తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్ కి తరగించగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతిచెందింది. మృతురాలి మరిది చాట్ల రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు.