మోత్కూరు, జూన్ 06 : గ్రామాల్లోని రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని మోత్కూరు మండల తాసీల్దార్ పి జ్యోతి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల నుంచి ధరఖాస్తులను స్వీకరించారు. రైతులు తమ భూమి సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ ఎం.ఉపేందర్, జె.సుమన్, డి.శ్రీనివాస్, కృష్ణ, ఇంద్రకుమార్, ఖాజా ఫరుద్దీన్ పాల్గొన్నారు.