రాజాపేట, జూన్ 03 : రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవాలని రాజాపేట తాసీల్దార్ అనిత అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ సమస్యల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాల్లోకే అధికారులు వస్తున్నారని, భూ సమస్యల కోసం రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం పలువురి రైతుల నుండి భూ సమస్యల వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీటీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్ఐ రమేశ్, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.